Bank of Baroda Manager Recruitment 2026 అంటే ఏంటి

బ్యాంక్ ఆఫ్ బరోడా కొత్తగా మేనేజర్ మరియు ఇతర సీనియర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇది బ్యాక్ లాగ్ డ్రైవ్. అంటే SC, ST, OBC కేటగిరీలకు మాత్రమే అవకాశం ఉంది. జనరల్ కేటగిరీ వాళ్ళు ఈ సారి అప్లై చేయలేరు. నోటీస్ తేదీ అక్టోబర్ 28 2026. అదే రోజు నుండి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ మొదలైంది.

ఈ రిక్రూట్మెంట్ లో సీనియర్ మేనేజర్ ప్రాజెక్ట్ ఫైనాన్స్, MSME క్రెడిట్ రిస్క్, ఎంటర్ ప్రైజ్ రిస్క్ మేనేజ్మెంట్ లాంటి పోస్టులు ఉన్నాయి. అన్నీ పర్మనెంట్ బేసిస్ మీదే ఉంటాయి. పోస్టింగ్ ఇండియా లో ఎక్కడైనా వేయొచ్చు. అందుకే అప్లై చేసే ముందు ఈ పాయింట్ గుర్తు పెట్టుకోవాలి.

ముఖ్యమైన తేదీలు గుర్తు పెట్టుకోండి

చాలా మంది లాస్ట్ డేట్ మిస్ అవుతారు. అందుకే డేట్స్ ముందే నోట్ చేసుకోండి. ఆన్ లైన్ అప్లికేషన్ క్లోజ్ అయ్యాక ఎక్స్టెన్షన్ ఉండదు. ఫీజు కూడా అదే రోజు కట్టాలి. ఏజ్, ఎలిజిబిలిటీ, ఎక్స్పీరియన్స్ అన్నీ కట్ ఆఫ్ డేట్ నాటికి లెక్కిస్తారు.

ఈవెంట్తేదీ
నోటిఫికేషన్ తేదీ28.10.2026
అప్లై స్టార్ట్28.10.2026
లాస్ట్ డేట్17.11.2026
కట్ ఆఫ్ తేదీ01.10.2026

అర్హతలు మరియు వయసు లిమిట్

అర్హత విషయానికి వస్తే ప్రతి పోస్టుకు వేర్వేరుగా ఉంది. కొన్ని పోస్టులకు గ్రాడ్యుయేషన్ తో పాటు CA కంపల్సరీ. ఉదాహరణకు బిజినెస్ ఫైనాన్స్ పోస్టుకు CA ఉండాలి. అలాగే ఆరు సంవత్సరాల అనుభవం పెద్ద బ్యాంకు లేదా NBFC లో ఉండాలి. మిగతా పోస్టులకు MBA లేదా సంబంధిత ఫీల్డ్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అడుగుతారు.

వయసు విషయంలో అతి తక్కువ లిమిట్ ఉన్న పోస్ట్ మేనేజర్ డిజిటల్ ఫ్రాడ్. ఇది 24 నుండి 34 సంవత్సరాల మధ్య ఉండాలి. అన్ని లెక్కలు 01.10.2026 నాటికి చూస్తారు. SC, ST వారికి ఐదేళ్లు అదనంగా ఇస్తారు. క్లరికల్ లేదా టీచింగ్ ఎక్స్పీరియన్స్ లెక్కలోకి రాదు. ఆరు నెలల కంటే తక్కువ జాబ్ ఉంటే ప్రస్తుత ఉద్యోగం అయితేనే పరిగణిస్తారు.

ఎంపిక విధానం ఎలా ఉంటుంది

సెలక్షన్ ప్రాసెస్ లో ముందు అప్లికేషన్ స్క్రూటినీ చేస్తారు. తర్వాత ఆన్ లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్ పెట్టొచ్చు. ఆ తర్వాత గ్రూప్ డిస్కషన్ లేదా ఇంటర్వ్యూ ఉంటుంది. కొన్ని పోస్టులకు రెండు మూడు రౌండ్ల ఇంటర్వ్యూ కూడా ఉండొచ్చు.

ఆన్ లైన్ టెస్ట్ ఉంటే ప్రతి సెక్షన్ లోనూ మినిమం మార్కులు రావాలి. ఓవరాల్ కూడా క్వాలిఫై అవ్వాలి. ఒకే కట్ ఆఫ్ వద్ద ఇద్దరు ఉంటే వయసు ఎక్కువ ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు. ఇంటర్వ్యూ లో జనరల్ మరియు EWS కు 60 శాతం, రిజర్వ్డ్ కేటగిరీలకు 55 శాతం కనీస మార్కులు కావాలి. ఫైనల్ మెరిట్ లిస్ట్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ స్కోర్ కలిపి తయారు చేస్తారు.

అప్లై చేసే విధానం మరియు డాక్యుమెంట్లు

అప్లై చేయడం మొత్తం ఆన్ లైన్ లోనే. బ్యాంక్ ఆఫ్ బరోడా వెబ్ సైట్ లో కెరీర్ పేజ్ లోకి వెళ్లి కరెంట్ ఆపర్చునిటీస్ ఓపెన్ చేయాలి. వేరే ఏ విధానం ద్వారా అప్లై చేసినా యాక్సెప్ట్ చేయరు. వాలిడ్ ఈమెయిల్ ఐడి మరియు మొబైల్ నంబర్ తప్పనిసరి. ప్రాసెస్ పూర్తయ్యే వరకు అవి యాక్టివ్ గా ఉంచాలి.

ఫామ్ లో బయోడేటా నింపి గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పర్సంటేజ్ రెండు దశాంశాల వరకు ఇవ్వాలి. మీ మీద FIR లేదా డిపార్ట్మెంట్ ప్రొసీడింగ్స్ ఉంటే చెప్పాలి. ఫోటో, సిగ్నేచర్, డాక్యుమెంట్లు అనెక్సర్ ప్రకారం అప్ లోడ్ చేయాలి. సబ్మిట్ నొక్కాక మార్పులు చేయలేరు. కాబట్టి ఒకసారికి రెండు సార్లు చెక్ చేసుకోండి.

డాక్యుమెంట్ల విషయానికి వస్తే రెజ్యూమె, టెన్త్ మార్క్ షీట్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లు ఒకే PDF లో, వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు, కుల ధ్రువీకరణ పత్రం, PWD సర్టిఫికేట్, CTC బ్రేక్ అప్ మరియు లేటెస్ట్ శాలరీ స్లిప్స్ కావాలి. ప్రతి ఫైల్ PDF, A4 సైజ్, 500 KB లోపు ఉండాలి. ఫోటో 20kb నుండి 50kb, సిగ్నేచర్ 10kb నుండి 20kb, JPG ఫార్మాట్ లో ఉండాలి.

డాక్యుమెంట్సైజ్ / ఫార్మాట్
ఫోటో20-50kb, JPG
సిగ్నేచర్10-20kb, JPG
ఇతర PDF లుA4, 500kb లోపు

సర్వీస్ కండిషన్స్ తెలుసుకోండి

సెలెక్ట్ అయ్యాక 12 నెలలు ప్రొబేషన్ ఉంటుంది. జాయిన్ అయిన తేదీ నుండి యాక్టివ్ సర్వీస్ లెక్కిస్తారు. మూడు సంవత్సరాలు తప్పనిసరిగా పని చేయాలి. ముందే వదిలేస్తే మూడు నెలల గ్రాస్ శాలరీ కట్టాలి. అది గరిష్టంగా మూడు లక్షల వరకు ఉంటుంది. సెలెక్ట్ అయిన వారు ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్ సైన్ చేయాలి.

ఫోటో సిగ్నేచర్ మరియు ఇంటర్వ్యూ రూల్స్

ఇంటర్వ్యూ కి ఏం తీసుకెళ్లాలి

ఇంటర్వ్యూ కాల్ లెటర్ మరియు సిస్టం జనరేటెడ్ అప్లికేషన్ ఫామ్ తప్పనిసరి. పుట్టిన తేదీ ప్రూఫ్, ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ తీసుకెళ్లాలి. రేషన్ కార్డు చెల్లదు. మార్క్ షీట్లు, సర్టిఫికేట్లు, ప్రభుత్వ ఫార్మాట్ లో కుల ధ్రువీకరణ పత్రం కావాలి. OBC సర్టిఫికేట్ నాన్ క్రీమీ లేయర్ తో మరియు ఏడాది లోపు ఇష్యూ అయి ఉండాలి.

ఏ డాక్యుమెంట్ ను పోస్ట్ ద్వారా బ్యాంకు కు పంపకూడదు. కాల్ లెటర్లు ఈమెయిల్ మరియు వెబ్ సైట్ లో మాత్రమే వస్తాయి. సిఫార్సు చేయమంటే డిస్ క్వాలిఫికేషన్ అవుతుంది. లీగల్ సమస్య వస్తే ముంబై కోర్టుల్లో మాత్రమే విచారణ ఉంటుంది. ఒక అభ్యర్థి ఒక పోస్టుకు మాత్రమే అప్లై చేయాలి. ఒకటి కంటే ఎక్కువ సార్లు అప్లై చేస్తే చివరి అప్లికేషన్ మాత్రమే పరిగణిస్తారు.

బ్యాంకు అఫ్ బరోడా మేనేజర్ జాబ్స్ ఆన్ లైన్ అప్లికేషను
బ్యాంకు అఫ్ బరోడా నోటిఫికేషన్ Pdf
బ్యాంకు ఆఫ్ బరోడా కేరిర్స్ పేజి

లక్ష్మణ్ | ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్స్

my telugu job
my telugu job
నమస్తే, నేను లక్ష్మణ్. గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ గురించి తెలుగులో అనుభవం కలదు. మీరు అప్లై చేసే ఉద్యోగాల కోసం వచ్చే చిన్న చిన్న డౌట్స్ అన్నీ మీకు సింపుల్ గా చెప్తాను.
WhatsApp Group Join Now
Telegram Group Join Now