BRAOU లో 26 పార్ట్ టైం లెక్చరర్ ఉద్యోగాలు వచ్చినయ్

మన హైదరాబాద్ లో ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో పెద్ద నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 26 పార్ట్ టైం లెక్చరర్ పోస్టుల కోసం పిలుస్తున్నారు. ఇది టెంపరరీ జాబ్ అయినా గవర్నమెంట్ యూనివర్సిటీ కదా, చదువుకున్నోళ్లకు ఇది మంచి ఛాన్స్. లాస్ట్ డేట్ వచ్చేసి 07-10-2026 దాకా ఉంది, ఇంకా టైం ఉంది కానీ ఆలస్యం చేయకు. మెయిల్ లోనే అప్లికేషన్ పంపాలి, ఎక్కడికి తిరగాల్సిన పని లేదు. ఈ ఉద్యోగం గురించి పూర్తి వివరాలు నేను కింద చెప్తా. ఇది మొత్తం ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళ అఫీషియల్ నోటిఫికేషన్. దీనికి సంబంధించిన BRAOU అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి చూడొచ్చు, అక్కడ అన్ని డీటెయిల్స్ ఉంటయ్.

ఇందులో ఒక సబ్జెక్టు కాదు, చాలా సబ్జెక్టులు ఉన్నయ్. మొత్తం 26 పోస్టులు అన్నారు కదా, అవి ఎట్లా ఉన్నాయంటే ఇంగ్లీష్ లో 2, హిందీ 1, ఉర్దూ 1, కామర్స్ 1, మ్యాథమెటిక్స్ 2, ఫిజిక్స్ 1, కెమిస్ట్రీ 1, బోటనీ 1, ఎన్విరాన్మెంటల్ సైన్స్ 1, జూలాజీ 1, కంప్యూటర్ సైన్స్ లో ఎక్కువగా 3 పోస్టులు, స్టాటిస్టిక్స్ 2, సోషల్ వర్క్ 1, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 1, పొలిటికల్ సైన్స్ 2, ఎకనామిక్స్ 2, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్స్ 1, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ 2 ఉన్నయ్. అంటే దాదాపు అన్ని గ్రూపుల వాళ్లకు ఛాన్స్ ఉంది. నీ సబ్జెక్టు ఏదైతే ఉందో ఆ లిస్టులో ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకో. నువ్వు ఏ సబ్జెక్టులో మాస్టర్స్ చేసినా దానికి తగ్గట్టు పోస్టు ఉంది. ఈ నోటిఫికేషన్ PDF మొత్తం చదవకుండా అప్లై చేయకు, అందుకే అఫీషియల్ నోటిఫికేషన్ PDF డౌన్లోడ్ చేసి పూర్తిగా చదువుకో, అప్పుడు అర్థం అవుతది.

ఇప్పుడు అసలు విషయం, క్వాలిఫికేషన్ ఏం కావాలి అంటే, ఫస్ట్ నీకు సంబంధించిన సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీ ఉండాలి, అందులో కనీసం 55% మార్కులు రావాలి. ఇది ఇండియన్ యూనివర్సిటీ నుండి అయి ఉండాలి. అంతే కాదు, దానితో పాటు నెట్ / స్లెట్ / సెట్ ఎగ్జామ్ పాస్ అయి ఉండాలి, అది UGC / CSIR వాళ్ళు పెట్టేది. ఒకవేళ నెట్ లేకపోయినా పిహెచ్డి చేసి ఉంటే కూడా ఓకే, కానీ ఆ పిహెచ్డి UGC రూల్స్ 2020 ప్రకారం ఉండాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏందంటే, నీకు తెలుగు చదవడం, రాయడం తప్పకుండా రావాలి, ఇది మస్ట్ అని చెప్పిండ్రు. ఎందుకంటే ఇది తెలుగు రాష్ట్రంలో ఓపెన్ యూనివర్సిటీ కదా. వయసు లిమిట్ గురించి పెద్దగా చెప్పలేదు కానీ నోటిఫికేషన్ లో చూడాలి. ఫీజు ఏం లేదు అంటున్నరు, ఫ్రీగానే అప్లై చేయొచ్చు. సెలక్షన్ ఎట్లా చేస్తారంటే రాత పరీక్ష 70 మార్కులకు, ఇంటర్వ్యూ 30 మార్కులకు ఉంటది, మొత్తం 100 మార్కులు. ఎవరు బాగా చేస్తే వాళ్లకు జాబ్ వస్తది. ఇంకేం ఆలోచించకు, నీకు ఈ క్వాలిఫికేషన్ ఉంటే వెంటనే రెడీ అయిపో.

BRAOU jobs అప్లై చేయటం ఎట్లా

ఇది చాలా సింపుల్, ఎక్కడికి పోయి లైన్ లో నిలబడాల్సిన పని లేదు. మొత్తం ఈమెయిల్ లోనే అయిపోతది. ఫస్ట్ నువ్వు నీ బయోడేటా రెడీ చేసుకో, అందులో నీ పేరు, ఫోన్ నంబర్, చదువు, ఎక్స్పీరియన్స్ అన్ని కరెక్ట్ గా రాయి. దానితో పాటు నీ సర్టిఫికెట్లు, మార్క్ షీట్లు, ఐడి ప్రూఫ్, పాస్ పోర్ట్ ఫోటో అన్ని జిరాక్స్ తీసి సెల్ఫ్ అటెస్ట్ చేసి స్కాన్ చేయాలి. ఈమెయిల్ సబ్జెక్టులో నువ్వు ఏ పోస్టుకు అప్లై చేస్తున్నావో క్లియర్ గా రాయి, ఉదాహరణకు Part Time Lecturer – English అని. ఇవన్నీ రెడీ చేసి అఫీషియల్ మెయిల్ ఐడికి పంపాలి. మెయిల్ ఐడి వచ్చేసి placementofficer@braou.ac.in ఇదే. ఈ మెయిల్ కి పంపాలి. లాస్ట్ డేట్ 7 అక్టోబర్ 2026 లోపు పంపాలి, ఆ తర్వాత పంపితే తీసుకోరు. ఒకసారి మెయిల్ పంపిన తర్వాత ఆ మెయిల్ కాపీని దాచుకో, ముందు ముందు అవసరం అవుతది. అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేసి అప్లై చేయి అని లింక్ ఇస్తున్నా, దీని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ మెయిల్ ఓపెన్ అవుతది. ఏ డౌట్ ఉన్నా అఫీషియల్ వెబ్సైట్ చూడు.

ఇట్లాంటి గవర్నమెంట్ యూనివర్సిటీ ఛాన్స్ మళ్లీ మళ్లీ రాదు. 26 పోస్టులు అంటే తక్కువ కాదు, చాలా మందికి ఉద్యోగం వచ్చే ఛాన్స్ ఉంది. నువ్వు మాస్టర్స్ చేసి, నెట్ కొట్టి ఇంట్లో ఖాళీగా ఉంటే ఇదే కరెక్ట్ టైం. పార్ట్ టైం అయినా ఎక్స్పీరియన్స్ వస్తది, తర్వాత పెద్ద ఉద్యోగాలకు హెల్ప్ అవుతది. మన తెలుగు వాళ్లకు తెలుగు వస్తే చాలు అంటున్నరు, ఇది మనకు ప్లస్ పాయింట్. ఇంకా ఆలస్యం చేస్తే లాస్ట్ డేట్ అయిపోతది, కాబట్టి ఇప్పుడే నీ డాక్యుమెంట్స్ అన్ని మెయిల్ రెడీ చేసి పంపేయ్.

అధికారిక నోటిఫికేషన్ PDF డౌన్లోడ్ చేసుకోండి

అప్లై చేయడానికి ఇక్కడ ఈమెయిల్ పంపండి – placementofficer@braou.ac.in

BRAOU అధికారిక వెబ్సైట్ ఇక్కడ చూడండి

ఇది టెంపరరీ అయినా కూడా మీకు మంచి పేరు వస్తుంది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పెద్ద యూనివర్సిటీ, హైదరాబాద్ లో ఉంది. అక్కడ పని చేస్తే మీకు చాలా నేర్చుకునే అవకాశం ఉంటుంది. మీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా ఈ అర్హత ఉంటే వాళ్ళకు కూడా చెప్పండి. చివరి తేదీ దగ్గర పడే వరకు ఆగకండి, ఇప్పుడే రెడీ చేసి ఈమెయిల్ పంపేయండి. మీకు ఉద్యోగం రావాలని కోరుకుంటున్నాను.

లక్ష్మణ్ | ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్స్

my telugu job
my telugu job
నమస్తే, నేను లక్ష్మణ్. గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ గురించి తెలుగులో అనుభవం కలదు. మీరు అప్లై చేసే ఉద్యోగాల కోసం వచ్చే చిన్న చిన్న డౌట్స్ అన్నీ మీకు సింపుల్ గా చెప్తాను.
WhatsApp Group Join Now
Telegram Group Join Now