RRB NTPC అండర్ గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్ 2026 పరిచయం

రైల్వే లో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు గుడ్ న్యూస్. RRB NTPC అండర్ గ్రాడ్యుయేట్ రిక్రూట్మెంట్ 2026 కింద CEN 07/2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్ పాస్ అయిన వాళ్లు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ ఉన్న వాళ్లు కూడా అర్హులే, వాళ్లకు ఇంటర్ లో 50% మార్కుల నిబంధన వర్తించదు. మొత్తం నాలుగు రకాల పోస్టులు ఉన్నాయి, అన్నీ క్లర్క్ కేటగిరీ కిందకే వస్తాయి.

ఈ నోటిఫికేషన్ లో Commercial cum Ticket Clerk, Accounts Clerk cum Typist, Junior Clerk cum Typist, Trains Clerk పోస్టులు ఉన్నాయి. ఆన్లైన్ అప్లికేషన్ https://rrb.indianrailways.gov.in/ వెబ్సైట్ లో 15 అక్టోబర్ నుండి 13 నవంబర్ 2026 వరకు జరుగుతుంది. ఒక అభ్యర్థి ఒకే ఒక్క అప్లికేషన్ పెట్టాలి, ఒక RRB మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి.

అర్హతలు మరియు జీతం వివరాలు

విద్యార్హత విషయానికి వస్తే 12th / ఇంటర్ పాస్ అయి ఉండాలి. గుర్తింపు పొందిన బోర్డు నుండి పాస్ అయితే చాలు. వయసు 18 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. వయసు లెక్కింపు తేదీ 01 జనవరి 2027. పదవ తరగతి సర్టిఫికెట్ లో ఉన్న పుట్టిన తేదీనే ఫైనల్ గా తీసుకుంటారు.

జీతం విషయంలో ఈ పోస్టులన్నీ 7th Pay Commission కింద Level 2 మరియు Level 3 లో ఉన్నాయి. ఇది కేవలం బేసిక్ పే మాత్రమే, దీనికి పైన DA, HRA వంటి అలవెన్సులు కలుస్తాయి. చేరిన తర్వాత శాలరీ మరింత పెరుగుతుంది.

జీతం పట్టికలో ఏముంటుంది

పోస్టు పేరుపే లెవెల్ప్రారంభ బేసిక్ పే
Commercial cum Ticket ClerkLevel 3Rs. 21,700
Accounts Clerk cum TypistLevel 2Rs. 19,900
Junior Clerk cum TypistLevel 2Rs. 19,900
Trains ClerkLevel 2Rs. 19,900

దరఖాస్తు రుసుము మరియు వయోపరిమితి పూర్తి లెక్క

అందరూ అడిగే ప్రశ్న ఫీజు ఎంత అని. జనరల్ మరియు నాన్-ఎక్సెంప్టెడ్ కేటగిరీ వాళ్లకు రూ. 500. SC, ST, Ex-Servicemen, PwBD, మహిళా అభ్యర్థులు, ట్రాన్స్జెండర్, మైనారిటీ కమ్యూనిటీ, Economically Backward Class (EBC) వాళ్లకు రూ. 250 మాత్రమే. ఈ ఫీజును Internet Banking, Debit Card, Credit Card, UPI ద్వారా కట్టవచ్చు.

ఫీజు రీఫండ్ సౌకర్యం కూడా ఉంది. CBT-1 కి హాజరైన వాళ్లకు మాత్రమే రీఫండ్ వస్తుంది. జనరల్ వాళ్లకు రూ. 400 తిరిగి ఇస్తారు, మిగిలిన రూ. 250 కేటగిరీలకు పూర్తి రూ. 250 తిరిగి ఇస్తారు, అందులో బ్యాంక్ ఛార్జీలు పోతాయి. ఆధార్ లింక్ ఉన్న బ్యాంక్ అకౌంట్ కి డబ్బు వస్తుంది, కాబట్టి అకౌంట్ కరెక్ట్ గా ఇవ్వాలి. ఇన్కంప్లీట్ అప్లికేషన్ లకు రీఫండ్ ఉండదు.

వయోపరిమితి క్లియర్ గా చెప్పాలంటే అందరికీ 18 నుండి 30 ఏళ్లు. UR/EWS వాళ్లు 02 జనవరి 1997 నుండి 01 జనవరి 2009 మధ్య పుట్టి ఉండాలి. OBC-NCL వాళ్లకు 02 జనవరి 1994 నుండి 01 జనవరి 2009 వరకు. SC/ST వాళ్లకు 02 జనవరి 1992 నుండి 01 జనవరి 2009 వరకు అవకాశం ఉంది. రెండు తేదీలు కలుపుకొనే లెక్క.

వయసు సడలింపు వివరాలు

రిజర్వేషన్ ఉన్న వాళ్లకు వయసులో సడలింపు ఉంటుంది. OBC Non-Creamy Layer కి 3 ఏళ్లు, SC/ST కి 5 ఏళ్లు. PwBD – UR/EWS కి 10 ఏళ్లు, PwBD – OBC-NCL కి 13 ఏళ్లు, PwBD – SC/ST కి 15 ఏళ్లు సడలింపు ఇస్తారు. Ex-Servicemen కి సర్వీస్ పీరియడ్ మినహాయించి అదనపు సడలింపు ఉంటుంది. రైల్వే ఉద్యోగులు, వితంతు / విడాకులు తీసుకున్న మహిళలకు కూడా ప్రత్యేక సడలింపు ఉంది.

పరీక్షా విధానం మరియు ఎంపిక ప్రక్రియ

సెలెక్షన్ లో నాలుగు దశలు ఉంటాయి. మొదట CBT-1, తర్వాత CBT-2, ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, చివరిగా మెడికల్ ఎగ్జామినేషన్. ఈ సారి Junior Clerk మరియు Accounts Clerk పోస్టులకు టైపింగ్ టెస్ట్ తీసేశారు. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలు, అది జాయిన్ అయ్యాక చూస్తారు.

CBT-1 లో 100 ప్రశ్నలు 100 మార్కులకు ఉంటాయి, సమయం 90 నిమిషాలు. తప్పు సమాధానానికి 1/3 మార్కు కోత ఉంటుంది. Scribe కి అర్హులైన వాళ్లకు 120 నిమిషాలు ఇస్తారు. ఇదే విధానం CBT-2 కు కూడా వర్తిస్తుంది.

CBT-1 మరియు CBT-2 తేడా ఏంటి

సబ్జెక్టుCBT-1 ప్రశ్నలుCBT-2 ప్రశ్నలు
General Awareness4050
Mathematics3035
General Intelligence and Reasoning3035
మొత్తం100120

అప్లై చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సినవి

CBT-2 లో 120 ప్రశ్నలు 120 మార్కులు, సమయం 90 నిమిషాలు. నెగటివ్ మార్కింగ్ 1/3. క్వాలిఫైయింగ్ మార్కులు UR/EWS కి 40%, OBC-NCL కి 30%, SC కి 30%, ST కి 25%. PwBD అభ్యర్థులకు నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది. కేవలం క్వాలిఫై అయితే సరిపోదు, మెరిట్ లో రావాలి.

మెడికల్ స్టాండర్డ్ కూడా ముఖ్యం. Commercial cum Ticket Clerk కి B-2, Accounts Clerk మరియు Junior Clerk కి C-2, Trains Clerk కి A-3 మెడికల్ స్టాండర్డ్ కావాలి. A-3 పోస్టుకు LASIK సర్జరీ చేయించుకున్న వాళ్లు అనర్హులు, B-2 మరియు C-2 పోస్టులకు అధికారిక నోటిఫికేషన్ లోని వైద్య నిబంధనల ప్రకారం నిర్ణయిస్తారు.

అప్లై చేసే ముందు RRB, పోస్టు ప్రిఫరెన్స్ జాగ్రత్తగా ఎంచుకోండి, ఎందుకంటే Create an Account సమయంలో ఇచ్చిన వివరాలు, ఎంచుకున్న RRB తర్వాత మార్చలేరు. లైవ్ ఫోటో క్యాప్చర్, సంతకం, అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి. ఒకటి కంటే ఎక్కువ అప్లికేషన్లు పెట్టవద్దు.

లక్ష్మణ్ | ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్స్

my telugu job
my telugu job
నమస్తే, నేను లక్ష్మణ్. గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ గురించి తెలుగులో అనుభవం కలదు. మీరు అప్లై చేసే ఉద్యోగాల కోసం వచ్చే చిన్న చిన్న డౌట్స్ అన్నీ మీకు సింపుల్ గా చెప్తాను.
WhatsApp Group Join Now
Telegram Group Join Now